21-02-2026 12:11:12 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాం తి) : రాష్ర్టంలో బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రతిపక్షాలుగా విఫలమయ్యాయని, ఆ పాత్రను మేమే పోషిస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురా లు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రాష్ర్టంలో చాలా చోట్ల ప్రజలు ఏ పార్టీకి మెజార్టీ ఇవ్వలేదని, అన్ని పార్టీలను ప్రజలు వ్యతిరేకిస్తున్నా రని పేర్కొన్నారు. హంగ్ వచ్చిన చోట కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు.
ట్యాంక్‌బండ్‌పై ఉన్న లేక్ వ్యూ పార్క్‌లో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటు పనులను శుక్రవారం కవిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండున్నరేళ్లుగా పూలే విగ్రహం అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని జాగృతి చేస్తున్న పోరా టం ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చిందని తెలిపారు. పూలే విగ్రహం అసెంబ్లీలో కూడా ఉం డాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై పెట్టాలని, ఖర్చు జాగృతి నుంచి భరిస్తుందని ప్రకటించారు. బీసీ రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
విద్యార్థుల పరీక్షలను కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం వరుస ఎన్నికలు నిర్వహిస్తోందని, తద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా చేస్తోందని విమర్శించారు. బడ్జెట్‌లో ఏటా బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్.కృష్ణయ్య, మా జాగృతి లాంటి సంస్థల పోరాటం ఫలితంగా బీసీల్లో చైతన్యం పెరిగిందని, మొన్న జరిగిన ఎన్నికల్లో బీసీలకు ఎక్కు వ స్థానాలు దక్కేందుకు ఆ చైతన్యమే కారణమని తెలిపారు. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.