మేడ్చల్ సీఐకి ప్రెస్‌క్లబ్ సభ్యుల సన్మానం
మేడ్చల్ అర్బన్ జూలై 30 (విజయక్రాంతి): మేడ్చల్ పోలీస్ స్టేషన్ సిఐ గా బాధ్యతలు చేపట్టిన బి అంజిరెడ్డిని మేడ్చల్ ప్రింట్ మీడియా క్లబ్ అధ్యక్షులు జె హరినాథ్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా సిఐ అంజిరెడ్డి తనను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన మేడ్చల్ ప్రింట్ మీడియా క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రజల రక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని, ప్రింట్ మీడియా క్లబ్ సభ్యులతో పాటు పలు రాజకీయ పార్టీల నాయకుల నుండి సహాకారం ఉండాలని సిఐ అంజిరెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి సలీం, క్లబ్ ప్రధాన కార్యదర్శి కనకాల దేవేంధర్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు మండల మురళి, ధాత్రిక గిరిబాబు, పాషా, ఉపాధ్యక్షులు శివ కుమార్, కోశాధికారి తదితరులు పాల్గొన్నారు.






