లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బోనాలు నిర్వహిద్దాం
మాజీ డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి
రాజేంద్రనగర్, జూలై 30 (విజయక్రాంతి): ఆగస్టు 9వ తేదీన రాజేంద్ర నగర్ నియోజక వర్గం పరిధిలోని 123 డివిజన్ హైదర్షాకోట్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో చేపట్టే బోనాల పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
బోనాల ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు గురువారం ఆలయంలో కాలనీ వాసులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు గ్రామ పెద్దలు, అలయ కమిటీ సభ్యులు పాల్గొనగా బోనాల ఉత్సవ కమిటీ ఏర్పాటు కమిటీని ఎంపిక చేశారు కమిటీ చైర్మన్ గా నర్సింగరావు . వైస్ చైర్మన్ గా లక్ష్మణ్ ఎన్నుకోవడం జరిగింది. అదే విధంగా ఆదివారం 9 న బోనాలు 10 సోమవారం పలహారం రథం ఉరేగింపు జరుపుకు పెద్దల సమక్షంలో తీర్మానం చేశారు.






