10 March, 2026 | 3:14 AM

గుత్తికోయగూడెంలో వైద్య శిబిరం

10-03-2026 12:28 AM

-హాస్టల్ విద్యార్థులకు వైద్య పరీక్షలు

వెంకటాపూర్, మార్చి 9 (విజయక్రాంతి): వెంకటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అడవి రంగాపూర్ గ్రా మపంచాయతీకి చెందిన బండ్లపాడు గుత్తికోయ గూడాన్ని వై ద్య బృందం సందర్శించి ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సి.హెచ్ శ్రీకాంత్ తెలిపారు. ఈ శిబిరంలో మొత్తం 57 మంది గుత్తికోయ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి చికిత్స అందజేశారు.

సందర్శనలో భాగంగా నలుగురు బాలింత తల్లులు మరియు వారి పిల్లలను పరీక్షించి వారికి ఆరోగ్య అవగాహన కల్పించి అవసరమైన వైద్య సేవలను అందించారు. అలాగే ముగ్గురు గర్భిణీ స్త్రీలను నమోదు చేసి వారికి టీటీ టీకాలు మరియు ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ పల్లె దవాఖాన వైద్యాధికా రి డాక్టర్ చందన, ఆరోగ్య కార్యకర్తలు శోభారాణి, మోతిలాల్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

హాస్టల్ విద్యార్థులకు వైద్య పరీక్షలు

వందరోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని రామానుజాపూర్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ మరియు బూరుగుపేట ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులకు స్పెషలిస్ట్ వైద్య బృందం ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 136 మంది విద్యార్థులను పరీక్షించి అవసరమైన వారికి మందులు అందజేసినట్లు వెంకటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సి.హెచ్ శ్రీకాంత్ తెలిపారు.