27 June, 2026 | 7:45 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

కేసముద్రం బల్దియాలో వైద్య శిబిరం

20-05-2025 03:37 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం బల్దియా కార్యాలయంలో వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజలకు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. అలాగే వచ్చే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రాప్తించకుండా తీసుకోవాల్సిన ముందస్తు నివారణ చర్యలను వివరించారు. పరిసరాల పరిశుభ్రతతో రోగాలకు దూరంగా ఉండవచ్చని సూచించారు. 50 ఏళ్లు పైపడ్డ వారు తరచుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, వైద్యాధికారులు డాక్టర్  కిషోర్, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ శివరాం, మున్సిపాలిటీ  వార్డ్ ఆఫీసర్స్ ప్రభాకర్, అహ్మద్ అన్సారీ,  సిహెచ్ఓ సాజిద్,  సూపర్వైజర్ చారి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు. మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.