calender_icon.png 20 May, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు ఉద్యోగాలు సాధించిన నిరుపేద యువకుడు

20-05-2025 03:41:41 PM

తల్లి బీడీ కార్మికురాలు, తండ్రి షుగర్ ఫ్యాక్టరీ కార్మికుడు 

అభినందిస్తున్న స్థానికులు

గ్రంథాలయంలో చదివి ఉద్యోగాలను సాధించిన వైనం

కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఈ రోజుల్లో మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడి పోటీ పరీక్షలు రాస్తే ఉద్యోగం సాధించడం ఈరోజుల్లో ఎంతో కష్టంగా మారిన తరుణంలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఓ యువకుడు రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబ పరిస్థితుల నుంచి బయటపడి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో పోటీ పరీక్షలు కోసం పుస్తకాలు చదివి ఎలాంటి కోచింగుకువెళ్లకుండా రెండు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించిన యువకుడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు.

అసలే నిరుపేద కుటుంబానికి చెందిన ఓ యువకుడు ఎలాంటి కోచింగ్ వెళ్లకుండా తల్లి బీడీలు చూడుతూ తండ్రి షుగర్ ఫ్యాక్టరీలో కార్మికంగా పనిచేస్తు చదివించిన తమ కొడుకు  ఒకేసారి రెండు  ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాడు. అనుమాల రవిచంద్ర ప్రైవేట్ టీచర్ గా పని చేస్తూ ప్రైవేట్ క్లాసెస్ చెప్తూ కామారెడ్డి లైబ్రరీలో చదివి గురుకుల టిజిటి పిజిటి రాష్ట్ర ర్యాంకులను సాధించి ఉద్యోగాలు సాధించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ కళాశాలలో హిందీ లెక్చరర్ గా ఎంపిక అయ్యాడు.

ఈ సందర్భంగా అనుమాల రవిచంద్ర మాట్లాడుతూ... తన విజయం వెనుక కుటుంబ సభ్యులకు ఎంతగానో ఉందని కష్టపడితే చదివితే అనుకున్న లక్ష్యాలను సులువుగా సాధించవచ్చు అని తెలిపారు. నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు. కాలనీవాసులే కాకుండా తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.