17 April, 2026 | 5:23 AM

మెడికల్ కళాశాల మానిటరింగ్ కమిటీ బృందం పర్యవేక్షణ

26-06-2025 11:19 PM

ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి ప్రభుత్వ వైద్యశాలలో మెడికల్ కాలేజ్ మానిటరింగ్ కమిటీ(Medical College Monitoring Committee) బృందం గురువారం పర్యవేక్షించారు. మెడికల్ కళాశాలలో సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. కళాశాల భవనం హాస్టల్ భవనాలను త్వరగా పోటీ చేసి అప్పగించాలని మానిటరింగ్ కమిటీ సూచించింది. తర్వాత ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసి లోటుపాట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్, కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.