30-06-2025 12:30:28 AM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
హనుమకొండ, జూన్ 29 (విజయ క్రాంతి): హన్మకొండ అంబెడ్కకర్ భవన్ లొ నిర్వహించిన మెడికల్ డీ-కోడింగ్ వర్క్ షాప్ ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయినిరాజేందర్ రెడ్డి ముఖ్య అతిదిగా హజరై ప్రారంబించారు. ఈ సందర్బంగ అయన మాట్లాడుతూ.. వరంగల్ నగరంలో ఇలా ఒక గొప్ప మెగా వర్క్ షాప్ జరుగుతుండటం గర్వంగా ఉందని మెడికల్ డికోడింగ్ అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చాలా పెద్ద కెరీర్ మార్గం అవుతోంది.
మీరు ఇండియా నుంచే యూకే, యూఎస్ఏ లాంటి దేశాలకు కోడ్ చేసే అవకాశం పొందుతున్నారని, ఇదే డిజిటల్ ఇండియా శక్తి అని అన్నారు. తాట్ ఫ్లోస్ల్ వంటి అకాడమీ ఇప్పటి వరకు 30,000 మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తును నిర్మించింది. ఇది గర్వించదగిన విషయం. ఈ రోజు మీరు తీసుకున్న ఈ ఒక అడుగు, రేపటి గొప్ప కెరీర్‌కు మొదటి మెట్టు అవుతుందని అన్నారు.
కార్యక్రమం నిర్వాహకులైన తాట్ ఫ్లోవ్స్ టీమ్‌ని అభినందించి ఇలాంటి కార్యక్రమాలకు మా సహకారం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. ఈ సదవకాశాన్ని సద్వినియొగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు. అంతకుముందు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయిని లక్ష్మా రెడ్డి, బంక సరళ సంపత్, విష్ణువర్ధన్ రెడ్డి, బంక సతీష్, యూత్ నాయకులు కేతిడి దీపక్ రెడ్డి, రాహుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.