4 July, 2026 | 11:17 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

ఘనంగా ఏకే విశ్వనాథరెడ్డి వర్ధంతి వేడుకలు

30-06-2025 12:29 AM

భీమదేవరపల్లి, జూన్ 29 (విజయ క్రాంతి) ఆసియా ఖండంలోనే పేరుగాంచిన ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకులు కీర్తిశేషులు అలిగిరెడ్డి కాశీ విశ్వనాధ రెడ్డి 39 వర్ధంతి వేడుకలు సహకార బ్యాంకు ఆవరణలో జరిగాయి. ఈ సందర్భంగా ఏకే విశ్వనాథరెడ్డి కాంస్య విగ్రహానికి బ్యాంకు రైతులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .

ఈ సందర్భంగా బ్యాంకు అధ్యక్షులు  ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ మెట్ట ప్రాంత రైతుల కష్టాలు తీర్చేందుకు కీర్తిశేషులు విశ్వనాథరెడ్డి సహకార బ్యాంకు ఏర్పాటుతో రైతుల పాలిటి కల్పతరువుగా సహకార బ్యాంకు నిలిచిందన్నారు. వర్ధంతి కార్యక్రమంలో సహకార బ్యాంక్ జనరల్ మేనేజర్ మార్పాడి రామ్ రెడ్డి తో పాటు వేలాది మంది రైతుల పాల్గొన్నారు.