21-12-2025 02:19:02 PM
కరింనగర్,(విజయక్రాంతి): డిసెంబర్ 24 నుంచి 26 వరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో కిసాన్ గ్రామీణ మేళాను నిర్వహిస్తున్నట్లు కిసాన్ గ్రామీణ మేళా అధ్యక్షులు పి.సుగుణాకర్ రావు తెలిపారు. ఈ మేళాను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభిస్తారని కేంద్ర, రాష్ట్ర మంత్రులను ఆహ్వానించంచామని తెలిపారు. ఈ మేళాలో రైతులకు కొన్ని కంపెనీల విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, రైతులకు తక్కువ ధరలో లభిస్తాయి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలో కొత్త టెక్నాలజీ ప్రదర్శన కార్యక్రమాలు ఉన్నందున జిల్లాలోని రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.