21-12-2025 02:42:30 PM
హైదరాబాద్: సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండల కేంద్రంలో ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమానికి నాలుగు వాహనాల్లో వచ్చిన ఎన్ఐఏ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని, మావోయిస్టులతో సంబంధాలపై విచారిస్తున్నారు.
ఇటీవల మరణించిన మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అంత్యక్రియల్లో గాదె ఇన్నయ్య పాల్గొన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మావోయిస్టులకు మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు రావడంతో ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలను సేకరిస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.