calender_icon.png 21 December, 2025 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా అయ్యప్ప మహా పడిపూజా

21-12-2025 02:24:26 PM

పూజలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్,(విజయక్రాంతి): కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ నిర్వహించారు. కిషన్ రెడ్డి దంపతులు  ఏటా అయ్యప్ప పడిపూజ నిర్వహిస్తున్నారు. ఈసారి మరింత ఘనంగా కార్యక్రమం జరిగింది. నారాయణగూడలోని కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలోని మైదానంలో ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.పలువురు ఎంపీలు, ఎమ్మెల్యే లు బిజెపి నేతలు ప్రముఖులు హాజరయ్యారు. అయ్యప్ప నామస్మరణతో ఈ  ప్రాంగణం మార్మోగింది