సబలెంకా బోణీ
ఫ్రెంచ్ ఓపెన్
ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మూడోరోజు పెద్దగా సంచలనాలు నమోదు కాలేదు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా బోణీ కొట్టగా.. నాలుగో ర్యాంకర్ రైబకినా సునాయాస విజయంతో రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది. పురుషుల విభాగంలో రష్యన్ స్టార్ మెద్వెదెవ్ చెమటోడ్చి నెగ్గగా.. కాస్పర్ రూడ్, సిట్సిపాస్‌లు సునాయాస విజయాలతో ముందంజ వేశారు.
పారిస్: సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో డానిల్ మెద్వెదెవ్ (రష్యా) శుభారంభం చేశాడు. మంగళ వారం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో మెద్వెదెవ్ 6 6 5 6 తో కోఫెర్ (జర్మనీ)పై కష్టపడి నెగ్గాడు. దాదాపు 3 గంటల పాటు జరిగిన మ్యాచ్ లో కోఫెర్ అద్భుతంగా పోరాడాడు. తొలి రెండు సెట్‌లను మెద్వెదెవ్‌కు కోల్పోయినప్పటికీ మూడో సెట్‌లో ఫుంజుకున్న కోఫెర్ 7 సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే నాలుగో సెట్‌లో తన అనుభవాన్ని మొత్తం రంగరించి మెద్వదెవ్ 6 సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. 11 బ్రేక్ పాయింట్లు సాధించిన మెద్వెదెవ్ ముందంజ వేయగా.. 38 అనవసర తప్పిదాలతో కోఫెర్ మూల్యం చెల్లించుకున్నాడు. రెండో రౌండ్‌లో కెక్‌మనోవిక్ (సెర్బియా)తో మెద్వెదెవ్ తలపడనున్నాడు.
ఇతర మ్యాచ్ ల్లో ఏడో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) తొలి రౌండ్‌లో 6 6 6 క్వాలిఫయర్ అల్వెస్‌ను ఓడించాడు. మరో పోరులో సిట్సిపాస్ (గ్రీస్) 7 (9/7), 6 6 ఫుక్సోవిక్స్ ( హంగేరి)పై విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ అరీనా సబలెంకా శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో సబలెంకా (బెలారస్) 6 6 ఆండ్రీవా (రష్యా)పై సునాయాస విజయాన్ని అందుకుంది. కేవలం గంటా 8 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన సబలెంకా ప్రత్యర్థిని చిత్తు చేసి రెండోరౌండ్‌కు దూసుకెళ్లింది. మరో పోరులో నాలుగో సీడ్ రైబకినా (కజకిస్థాన్) 6 6 బెల్జియంకు చెందిన మిన్నెన్‌పై విజయాన్ని అందుకుంది. 5వ సీడ్ వోండ్రోసోవా 6 6 మసరోవాపై, చైనాకు చెందిన 7వ సీడ్ జెంగ్ 6 6 కార్నెట్‌పై విజయాలు సాధించి తదుపరి రౌండ్‌లో అడుగుపెట్టారు.






