4 May, 2026 | 10:05 PM

ప్రభుత్వ పాఠశాలలో సమావేశాలు నిర్వహించాలి

18-09-2025 06:57 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో గురుకుల విద్యాసంస్థలు ఈ నెల 20న మూడవ శనివారం సమావేశాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న తెలిపారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు పోషకులు పాఠశాల అభివృద్ధిపై చర్చించి ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. దసరా సెలవులు వస్తున్న నేపథ్యంలో ఇంటి వద్ద పిల్లల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉపాధ్యాయుల సూచనలు చేయాలన్నారు.