18-09-2025 07:00:03 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ ఫార్మర్ సొసైటీ పరిధిలో రైతులందరికీ సరిపడే విధంగా యూరియా అందుబాటులో ఉందని చైర్మన్ ధర్మాజీ రాజేందర్(Chairman Dharmaji Rajender) అన్నారు. గురువారం సంఘ కార్యాలయంలో యూరియా పంపిణి తనిఖీ చేసి రైతుల అవసరముందరకు మాత్రమే యూరియా బ్యాగులు తీసుకోవాలని సూచించారు. యూరియా పక్కదారి పట్టకుండా పకడ్బందీగా పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.