18-09-2025 06:55:42 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతులకు, పరిశోధనా కేంద్రాల్లో అభివృద్ధి చేసిన నాణ్యమైన విత్తనాన్ని సరఫరా చేసి, విత్తనోత్పత్తిని గ్రామంలోనే ప్రోత్సహించేందుకు గ్రామగ్రామన నాణ్యమైన విత్తనం (క్వాలిటీ సీడ్స్ ఇన్ ఎవ్రి విలేజ్ - క్యూఎస్ఇవి) అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి మండలం కమాన్ పూర్ గ్రామంలో వరి (జెజిఎల్ - 24423) క్షేత్రాలను పరిశీలించి, బెరుకులు తీసివేయాలని సూచించారు. పైరులో కొద్దిగా ఆకుముడతను గమనించడం జరిగింది. ఆకుముడత నివారణ కొరకు కార్టాప్ హైడ్రో క్లోరైడ్ 2 గ్రాములు ఒక లీ. నీటికి చొప్పున పిచికారీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ ప్రధాన శాస్త్రవేత్త డా.బి. రాంప్రసాద్, శాస్త్రవేత్తలు డా. జి. ఉషారాణి, ఇ. ఉమారాణి, వ్యవసాయ విస్తరణ అధికారీ రాజేంద్ర ప్రసాద్, రైతులు ఆకుల శంకరయ్య, గిర్ర శ్రీనివాస్ మరియు గ్రామానికి చెందిన ఇతర రైతులు పాల్గొన్నారు.