calender_icon.png 8 December, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంద్రానగర్ కాలనీలో మెగా ఉచిత వైద్య శిబిరం

07-12-2025 08:10:35 PM

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ ఎన్జీవోస్ కాలనీ రోడ్ వద్దిరాజు అపార్ట్మెంట్లో ఇందిరానగర్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలకమండలి సభ్యులు ఇ.వి శ్రీనివాసరావు, స్థానిక కార్పొరేటర్ గుజ్జుల వసంత మహేందర్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి తేళ్ల సుగుణలు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు.

ఫాతిమా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ పి.సుఖేష్ రెడ్డి ఆర్థోపెడిక్ అండ్ రోబెటిక్ సర్జన్ చే బోర్డ్ డెసిక్ టెస్ట్ నిర్వహించారు. డాక్టర్ కిరణ్ డెంటల్ పరీక్షలు, డాక్టర్ వైద్యం గౌతమ్ జనరల్ ఫిజీషియన్ వైద్య పరీక్షలు చేయడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో 500 మందికి పైగా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇందిరానగర్ కాలనీ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి తేళ్ల కిషోర్, రావుల నారాయణరెడ్డి, సత్యనారాయణ, నెల్లుట్ల శివప్రసాద్, వేణు, మహేందర్, పాపారావు, రంజిత్, కమిటీ సభ్యులు, కాలనీవాసులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.