calender_icon.png 8 December, 2025 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకగ్రీవాలు కాంగ్రెస్ పార్టీ విజయం వైపు తొలి అడుగు

07-12-2025 08:13:50 PM

వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు..

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల పరిధిలోని అర్వపల్లి, కొత్తపల్లి గ్రామ పంచాయతీ స్థానాలకు అంబాల ప్రభాకర్ గౌడ్, దండ్రి సాంబయ్య ఏకగ్రీవం కావడంతో మండలంలో అన్ని గ్రామాల సర్పంచ్ స్థానాలకు నాంది పలికిందన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు అన్నారు. ఆదివారం హన్మకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఏకగ్రీవంగా ఎన్నికైన అంబాల ప్రభాకర్, దండ్రి సాంబయ్య లను మర్యాదపూర్వకంగా కలువగా వారిని ఎమ్మెల్యే నాగరాజు వారిని శాలువాతో సత్కరించి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ఓకే తాటిపై ఉండి సమిష్టిగా గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఇదే ఉత్సాహంతో కష్టపడి పని చేస్తే మండలంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా అర్వపల్లి, కొత్తపల్లి గ్రామాలు బిఆర్ఎస్, బిజెపి పార్టీల నుంచి పలువురు ఎమ్మెల్యే  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఏంసి వైస్ చైర్మన్ తంగళ్ళపల్లి తిరుపతి, హాసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.