7 July, 2026 | 2:18 AM

10న ఓయూలో మెగా జాబ్ మేళా

07-07-2026 12:00 AM

తెలంగాణ ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్

ముషీరాబాద్, జులై 6 (విజయక్రాంతి): తెలంగాణ ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీటీపీఓఏ), జీవీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జూలై 10న ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో మెగా జాబ్ మేళా-2026 నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీటీపీఓఏ అధ్యక్షుడు డా.జయరాం, డా.ఎంజీఆర్ రామచంద్రన్, జీవీకే ప్రతినిధి అజయ్ కుమార్తో కలిసి జాబ్ మేళా గోడపత్రికను ఆవిష్కరించారు.

అనంతరం వారు మాట్లాడుతూ 100కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు.10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, పీజీ, ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు రెజ్యూమ్/బయోడేటా, ఆధార్ కార్డు, ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్, పాన్ కార్డు కాపీ, విద్యార్హత పత్రాల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ : 93919 27259, 8466670308 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.