7 July, 2026 | 2:13 AM

తెలంగాణలో ఆర్పీఐ(ఏ) బలోపేతమే లక్ష్యం

07-07-2026 12:00 AM
  1. 15న కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే రాక
  2. రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) అధ్యక్షుడు పేరం శివనాగేశ్వర్

ముషీరాబాద్, జులై 6 (విజయక్రాంతి): తెలంగాణలో ఆర్పీఐ(ఏ) బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆర్పీఐ(ఏ) జాతీయ కార్యదర్శి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఇన్చార్జి పేరం శివనాగేశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి, ఆర్పీఐ(ఏ) జాతీయ అధ్యక్షుడు రాందాస్ అథవాలే జులై 15న హైదరాబాద్కు రానున్నట్లు చెప్పారు.

తెలంగాణలో పార్టీ విస్తరణ, సభ్యత్వ నమోదు, జిల్లా కమిటీల ఏర్పాటు, యువతను పార్టీతో అనుసంధానం చేయడం వంటి అంశాలపై చర్చించారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ విజయానికి ఆర్పీఐ(ఏ) కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్న ప్రసాద్, మేడి సతీష్ కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రవికుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సచిన్ గౌడ్, లీగల్ సెల్ కన్వీనర్ రవి ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు.