జిల్లా కేంద్రాల్లో మెగా జాబ్‌మేళా
వికారాబాద్/ రంగారెడ్డి, జూన్ 18 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకుల కోసం రేపు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి జయశ్రీ పేర్కొన్నారు. సికింద్రాబాద్ పారడైస్ సర్కిల్ సమీపంలోని చంద్రలోక్ కాంప్లెక్స్‌లో గల స్టాపింగ్ టైటాన్స్ ప్రైవెట్ లిమిటెడ్‌లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య గల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
స్వీకర్ గడ్డం ప్రసాద్ ఆధ్వర్యంలో..
టీజీ స్టెప్ ఆధ్వర్యంలో ఈ నెల 23న జిల్లా కేంద్రంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెగా జాబ్‌మేళా వాల్ పోస్టర్‌ను హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో విడుదల చేశారు. సుమారు 60 కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్‌మేళాలో పాల్గొని 5 నుండి 8 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారని తెలిపారు. వికారాబాద్‌లోని గౌలికర్ పంక్షన్ హాల్‌లో ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని, పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన నిరుద్యోగులు జాబ్‌మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు.






