calender_icon.png 9 September, 2025 | 12:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏటూరు నాగారంలో మెగా జాబ్ మేళా

09-09-2025 12:00:00 AM

నిరుద్యోగ యువకుల కోసం మెగా జాబ్ మేళా నిర్వహించిన 

బీఆర్‌ఎస్ నాయకులు భూక్య జంపన్న 

ఏటూరునాగారం, సెప్టెంబరు8 (విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు భూక్య జంపన్న ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకుల కోసం మెగా జాబ్‌మేళా  కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యాఅథిగా ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు విచ్చేసి కార్యక్రమనీ రిబ్బన్ కట్ చేసి  ప్రారంభించినారు.

ములుగు జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ భూక్య జంపన్న ఏటూరునాగారం మండల కేంద్రంలో భూక్య జంపన్న నిరుద్యోగ యువతి యువకుల కోసం మంచి కార్యక్రమాన్ని నిర్వహించారని అభినందించారు ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువతీ యువకులు సుమారు 200 మంది యువతీ యువకులు  వరకు పాల్గొనడం జరిగింది అందులో 80 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది వారికి ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది 120మందికి సంబంధించిన నిరుద్యోగ యువతీ యువకులను వివిధ కంపెనీలకు రిఫర్ చేయడం జరుగుతుంది అని వారు తెలుపడం జరిగింది