15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సింగరేణి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

31-10-2025 11:05 PM

ఏరియా జిఎం దుర్గం రామచందర్ 

మణుగూరు,(విజయక్రాంతి): సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఏరియా  సింగరేణి సంస్థ ఆధ్వర్యం లో నవంబర్ 9న  మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఏరియా జిఎం దుర్గం రామచందర్ శుక్రవారం మీడియా సమావేశంలో తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన సుమారు 100 ప్రైవేటు సంస్థల లో వివిధ విభాగాల్లో 3 వేల ఖాళీలు భర్తీ కోసం ఎంపిక జరుగుతుందన్నారు . నిరుద్యోగ యువత హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు 

చేయడం వ్యయ ప్రయాసలతో కూడుకుని ఉంటోందని, ఈ నేపథ్యంలో పలు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి స్థానికంగా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనిని నిరుద్యోగ యువత సద్విని యోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. సింగరేణి సంస్థ లో ఉద్యోగ నియామకాల తో పాటు, నిరుద్యోగ యువత అందరికీ ఏదో ఒక ఉపాధి లేదా ఉద్యోగం కల్పించడం కోసం ఈ తరహా కార్యక్రమాలను సింగరేణి సంస్థ స్వచ్ఛందంగా చేపడు తుందని , ఈ అవకాశాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువతలో నైపుణ్యాలు పెంచడమే కాకుండా వారికి ఉద్యోగ అవకా శాలను కల్పించేందుకు వీలుగా జాబ్ మేళాలను కూడా ఏర్పాటు చేయిస్తున్నట్లు వివరించారు.