01-11-2025 12:00:00 AM
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 31 ( విజయక్రాంతి): రైతులు పండించిన ధాన్యం కుప్పలు తేమ శాతం చూసి వెంటనే కాంటావేసి కొనుగోలు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు పి.ఏ.సి.ఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, మందనపల్లి గ్రామంలో ఎఫ్ .పి.ఓ ఆధ్వర్యంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కేంద్రంలో ధాన్యం ఆరబోసిన రైతులతో మాట్లాడుతూ..ఎన్ని రోజులు అయింది వచ్చి, ఎన్ని ఎకరాలు వేశారు. మొన్న కురిసిన వర్షానికి ఏమైనా ధాన్యం తడిసిందా అని అడిగి తెలుసుకున్నారు. రైతు మూడు నాలుగు రోజులు అయిందని తెలిపారు. ధాన్యం ఆరబోసిన తేమశాతం వచ్చే సమయానికి వర్షం రావడంతో మళ్లీ కొంచెం తడిసిందని తెలిపారు.
రెండు రోజులు ఎండలు బాగా రావడంతో ధాన్యం ఆరబెడుతున్నామన్నారు. ఉదయం వచ్చి తేమ శాతం చూసి సాయంత్రం ధాన్యం కొనుగోలు కాంటాకి వేస్తామని అధికారులు తెలియజేశారన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.