calender_icon.png 1 November, 2025 | 7:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ సదస్సును జయప్రదం చేయాలి

01-11-2025 12:00:00 AM

ఎల్బీనగర్ , అక్టోబర్ 31 : 42శాతం రిజర్వేషన్లు సాధిస్తామని తెలంగాణ జన సమితి ప్రధాన కార్యదర్శి  పల్లె వినయ్ కుమార్ అన్నారు. శనివారం నిర్వహిస్తున్న బీసీ సదస్సును విజయవంతం చేయాలని దిల్ సుఖ్ నగర్ లో శుక్రవారం రంగారెడ్డి కమిటీ ఆధ్వర్యంలో  వాల్ పోస్టర్, కరపత్రా న్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలం గాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్ కుమార్ మాట్లాడుతూ...  చట్టబద్ధమైన రిజర్వేషన్లను బీసీలకు  కల్పించాలని,  స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

1వ తేదీన నిర్వహించనున్న బీసీ సదస్సును జయప్రదం చేయాలని  విజ్ఞప్తి చేశారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు దక్కాల్సిన  42శాతం రిజర్వేషన్ల అమలును 9వ షెడ్యూల్లో చేర్చి పార్లమెంటులో బిల్లు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త రవి, రాష్ట్ర కమిటీ సభ్యులు కెవి రంగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పగడాల రమణ, నాయకులు దిలీప్, వెంకటేష్ గౌడ్  పాల్గొన్నారు.