‘మేకల’ మృతి బీజేపీకు తీవ్ర నష్టం: సంకినేని
గరిడేపల్లి, జూన్ 18: తెలంగాణ మలిదశ పోరాట నాయకులు, భారతీయ జనతా పార్టీ ఓబీ సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మేకల వెంకటేశ్వర్లు ఆకస్మిక మృతి పార్టీకి తీరని నష్టమని మాజీ శాసనసభ్యులు, భాజాపా కేంద్ర నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన సంతాప కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అంకితభావం, కృషి పట్టుదలతో ముందుకు సాగే తత్వం మేక ల సొంతమన్నారు.
పార్టీ ఎదుగుదలకు నిరంతరం శ్రమించారని, గడ్డిపల్లిలో నిర్వహించే మాత జాతరలో పార్టీ ఫ్లెక్సీలతో సెంట్రల్ అట్రాక్షన్ గా నిలిచేవారున్నారు. మంచి క్రమశిక్షణ గల నాయకున్ని చిన్న వయసులోనే అకాల మరణం సంభవించడం పార్టీకి మనోవేదన లాంటిదన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ ఆయన చిత్రపటానికి పూ లమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో టెలికాం అడ్వజరీ కమిటీ మాజీ బోర్డు మెంబర్లు సంధ్యాల సైదులు, పోకల వెంకటేశ్వర్లు, గరిడేపల్లి, పెన్ పహాడ్ మండల అధ్యక్షులు కుక్కడపు వెంకటేశ్వర్లు, తాళ్లపల్లి మధు, జిల్లా కార్యదర్శి తాళ్ల నరేందర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు పోకల రాములు, కొణతం సత్యనారాయణ రెడ్డి, అన్నారం సర్పంచ్ సుం దరి రామారావు, రామినేని కృష్ణయ్య, రామినేని బిక్షమయ్య, కొప్పుల రాంరెడ్డి, చిత్తలూరి సోమ య్య, ఎడవెల్లి బాటసారి తదితరులు పాల్గొన్నారు.






