జీవీటీసీ సమస్యలపై మేనేజర్ లక్ష్మన్‌కు వినతి పత్రం
కొత్తగూడెం, జూన్ 4, (విజయక్రాంతి): ఐఎన్డీయూసీ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, గురువారం రోజున, నాయకులతో కలిసి జీవీటీసీలో ఉన్న సమస్యలపై జీవీటీసీ మేనేజర్ లక్ష్మణ్ ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జీవీటీసీ నందు ఆర్వో ప్లాంట్ త్రాగునీరు ఏర్పాటు చేయాలి, దూర ప్రాంతాల నుండి ట్రైనింగ్ కోసం వచ్చే సూపర్వైజర్లు, ఉద్యోగులు, డిఎల్‌ఆర్ కార్మికులు, ఆల్ ట్రేడ్ అప్రెంటిసులు త్రాగునీరు, భోజనం చేయడానికి త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు.
డెస్క్ టేబుల్స్ మరియు చైర్స్ ఏర్పాటు చేయాలి. ఇన్స్టిట్యూటర్స్ రిటైర్డ్ అయినందున వారి స్థానాల్లో ఇన్స్టిట్యూటర్ని భర్తీ చేయాలి. జిరాక్స్ ప్రింటర్ ను ఏర్పాటు చేయాలి, జీవీటీసీ నందు దూర ప్రాంతాల నుండి ట్రైనింగ్ కు వచ్చే వారికి క్యాంటీన్ లేక ఇబ్బంది అవుతున్నదని,క్యాంటిన్ ఫెసిలిటీ కల్పించాలి, అలాగే క్లాస్ లు వినడానికి ఏ/సి రూమ్ ఏర్పాటు చేయాలి.
జి. బి.టి.సి,పరిసర ప్రాంతంలో చెత్త ఎక్కువ ఉండడం వల్ల క్లీనింగ్ చేయించాలి, జీవీటీసీ మేనేజర్ కు ఐఎన్టీయూసీ యూనియన్ ద్వారా సమస్యలను వారికి వివరించడం జరిగింది. పై అధికారులతో మాట్లాడి ఈ సమస్యలను త్వరగా పరిష్కరిస్తానని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిట్ ఇంఛార్జి బొద్దుల రవీందర్, ఎం కొమురయ్య పోషo శ్రీనివాస్, గౌస్ ,సందీప్, జయరాం, రాఫిక్ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు.






