4 June, 2026 | 2:25 AM

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

04-06-2026 01:51 AM

సుల్తానాబాద్, జోన్ 3 (విజయక్రాంతి): ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ వ్యాఖ్యాతలు ఎల్లంకి వైకుంఠం, ఈ, రామ్మోహన్ రావులు అన్నారు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వాసవి మాత దేవాలయంలో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానము ధర్మ ప్రచార పరిషత్ వారు నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగంగా శ్రీ రా మాయణ విశిష్టత, రామాయణ పారాయణప్రాధాన్యత,రామాయణ ము లోని పాత్రల ప్రభావం మన జీవితాలపై , మన కుటుంబ వ్యవస్థ పై ఏ విధంగా ప్రభావం ఉంటుందనే విషయాలపై వ్యాఖ్యాతలు వివరించారు.

ఈ కార్యక్రమం లో ఆలయ చైర్మన్ చకిలం మారుతి , పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్, ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లంకి లింగమూర్తి , సామాజిక సేవకులు పల్ల కిషన్, రామిడి రవీందర్ తో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు... వాసవి మాత దేవాలయం అర్చకులు వల్ల కొండ మఠం మహేష్ తీర్థ ప్రసాదాలు అందజేశారు...