4 June, 2026 | 2:22 AM

హాస్టల్ భవనాలకు నిధులు కేటాయించండి

04-06-2026 01:49 AM

వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

జగిత్యాల, జూన్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో 181 హాస్టల్లో అద్దె భవనాల్లో నడుస్తున్నాయని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న హాస్టళ్లకు పక్కా భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కేంద్ర సామాజిక న్యాయం సాధికారిక మంత్రి వీరేంద్ర నాథ్ ను కోరారు.

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత విభాగం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.మూడు ప్రధాన అంశాలను అజెండాగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

ఆదర్శ గ్రామం, రాష్ట్ర/ జిల్లా స్థాయి ప్రాజెక్టుల సహాయక గ్రాండ్ల విభాగం మరియు హాస్టల్ విభాగం పథకం మార్గదర్శకాల ప్రకారం సెంట్రల్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు.వీడియో కాన్ఫరెన్స్ కి హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 181 హాస్టల్స్ అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు ఎంతో ఉపయోగం గా ఉండే హాస్టల్స్ అద్దె భవనాలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని తెలంగాణ లోని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న హాస్టల్స్ కు పక్కా భవనాలు నిర్మించడానికి నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా కోరారు.