పోలీస్ కస్టడీకి సుబోధ్‌సింగ్
కరీంనగర్ క్రైం, జూన్ 3 (విజయక్రాంతి): కరీంనగర్‌లోని పీఎంజే జూవెల్లరీ షాపులో జరిగిన దోపిడీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సుబోధ్ సింగ్‌ను కరీంనగర్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. దోపిడీలో సుబోధ్ సింగ్ ప్రమేయం లభ్యం ఉన్నట్టుగా ప్రాథమిక ఆధారాలు కావడంతో అతన్ని విచారించేందుకు అనుమతివ్వాలని బీహార్‌లోని కోర్టులో కరీంనగర్ పోలీసులు పిటీ వారెంట్ వేశారు.
ఇందుకు బీహార్ కోర్టులు అనుమతించడంతో సుబోధ్‌సింగ్‌ను మే 28న కరీంనగర్ కోర్టుకు తీసుకవచ్చి హాజరుపరిచారు. ఈ కేసులో సుబోధ్‌సింగ్ తో పాటు మరో ముగ్గురు నిందితులను కూడా పోలీసులు కస్టడీకి తీసుకు న్నారు. కరీంనగర్ జ్యోతీనగర్ పీఎంజే జ్యువెలరీ షోరూంలో మే 3న దోపిడీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ దోపీడీకి ఐదుగురు నిందితులు పాల్పడగా ప్రతిఘటించిన షో రూం నిర్వాహాకులపై కాల్పులు కూడా జరిపి పరార్ అయ్యారు. రాబరీ గ్యాంగ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసి ఇద్దరు దొంగలను, సిమ్ కార్డు విక్రయించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.






