మతిస్థిమితం లేని మహిళ అదృశ్యం
06-07-2026 12:47 AM
మేడిపల్లి, జూలై 5 (విజయక్రాంతి): మతిస్థిమితం లేని మహిళా అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భీమ్‌రెడ్డినగర్‌కు చెందిన పాండల శంకరయ్య కు ఇద్దరు కుమార్తెలు, చిన్న కూతురు పాండల శైలజ (35) మతిస్థిమితం సరిగా లేదు. అదే కాలనీలో ఉన్న అక్క భాను, ఇంటికి రోజు మాదిరిగా వెళ్ళిం ది. ఈరోజు ఉదయం రెండు నుంచి మూ డు గంటల ప్రాంతంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి రాలేదు. చుట్టుపక్కల వెతికిన ఆచూకీ లభించకపోవడంతో తండ్రి శంకరయ్య మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.






