17 April, 2026 | 10:36 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

పాఠ్య పుస్తకాలను పంపిణీచేసిన ఎంఈఓ

02-06-2025 04:31 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం విద్యా వనరుల కేంద్రంలో 2025- 26 విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాలను సోమవారం మండల విద్యాశాఖ అధికారి వై. తిరుపతి రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల ప్రారంభానికి ముందుగానే పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు చేరవేయాలని ఉద్దేశంతో ముందుగానే పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. పాఠ్య పుస్తకాలతో పాటు రెండు జతల యూనిఫామ్ లను పంపించడం జరుగుతుందన్నారు.

యూనిఫారాలు ఇప్పటివరకు 80% కుట్టడం పూర్తయిందన్నారు. మండలానికి మొదటి పార్ట్ పాఠ్యపుస్తకాలు 86% రావడం జరిగిందని ఆయన తెలిపారు.  పాఠశాలకు లైబ్రరీ పుస్తకాలను కూడా ప్రభుత్వం పంపించేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరామిరెడ్డి. నిజాంసాగర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశం, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు సీఆర్పీబీ శ్రీధర్ కుమార్, ఎం.వరలక్ష్మి, పీ.నర్సింలు ఎంఐఎస్ కోఆర్డినేటర్ రాజు, కంప్యూటర్ ఆపరేటర్ అనిల్, ఐఇఆర్పిలు గైని చిన్న సాయిలు, సునీల్ కుమార్, మెసెంజర్ పంచాక్షరి తదితరులు పాల్గొన్నారు.