16 March, 2026 | 2:56 PM

Breaking News

అసెంబ్లీ ఆవరణలో 'తెలంగాణ తల్లి' విగ్రహావిష్కరణ   •   మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •   తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం.. లేకుంటే అన్యాయమా?   •   గండిపేటలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు జలసమాధి   •   తండాలకు ప్రగతి వెలుగులు నా లక్ష్యం   •   పశువులకు గాలికుంటు నిరోధిక టీకాలను వేయించాలి   •   సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్, వార్డు సభ్యులు   •   ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి   •  

ఎంజీయూ డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

07-01-2026 12:00 AM

నల్గొండ టౌన్, జనవరి 6: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ పరీక్ష ఫలితాలను వీసీ ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ మంగళవారం యూనివర్సిటీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వహణ ప్రణాళిక బద్దంగా పారదర్శకంగా నిర్వహించి ఆదర్శంగా నిలవాలన్నారు. డిగ్రీ మొదటి సెమిస్టర్ లో 8295 మంది విద్యార్థులు హాజరుకాగా 1806 మంది (21.77%), మూడవ సెమిస్టర్ లో ఐదు ఎనిమిది మూడు నాలుగు మందికి గాను 1569 (26.89%), ఐదవ సెమిస్టర్ లో 5586 మందికి గాను 2109 మందిరి (37.76%) ఉత్తీర్ణత సాధించినట్లు సిఈఓ డా ఉపేందర్ రెడ్డి తెలిపారు.

రీవాల్యూషన్ కొరకు జనవరి 22వ తారీకు లోపు, ప్రతి సబ్జెక్టుకు రెండువందల రూపాయల రుసుము చెల్లించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆకుల రవి, అధికారులు డా లక్ష్మి ప్రభ, డా కళ్యాణి, డా ప్రవళిక, డా బిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.