07-01-2026 12:00:00 AM
చిట్యాల, జనవరి 6 (విజయక్రాంతి): నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశమును మర్యాదపూర్వకంగా తాళ్ల వెల్లంల మాజీ సర్పంచ్ జనగాం రవీందర్ గౌడ్ మంగళవారం కలిసి సన్మానించారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం తాళ్ల వెల్లంల గ్రామ మాజీ సర్పంచ్ జనగాం రవీందర్ గౌడ్ మరియు ఆయన కుమారుడు జనగాం కళ్యాణ్ (కిట్టు ) ఎమ్మెల్యే వేముల వీరేశం ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి, పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సన్మానించారు.
ఇటీవల లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పొలిటికల్ సైన్స్ విభాగం నందు మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి లండన్ పర్యటన ముగించుకొని స్వదేశానికి వచ్చిన జనగాం కళ్యాణ్ (కిట్టు) మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యే వేముల వీరేశం ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు. అనంతరం పొలిటికల్ సైన్స్ విభాగం నందు లండన్ లో మాస్టర్స్ పూర్తి చేసినందుకుగాను కళ్యాణ్ ను ఎమ్మెల్యే అభినందించారు.