07-01-2026 12:00:00 AM
ఓటర్ లిస్టుల పరిస్థితి
తప్పుల తడకలు కనిపిస్తున్న ఓటర్ లిస్ట్‌లు
ఒక వార్డుల వారి పేర్లు మరో వార్డులో ప్రత్యక్షం
ఇంటింటికి తిరిగి పున పరిశీలన చేస్తున్న మున్సిపల్ సిబ్బంది
కౌన్సిలర్‌గా పోటీ చేసే ఆశావాహూలకు ఓటర్ లిస్టుల షాక్
ప్రతి వార్డులో ఓటర్ లిస్టుల తప్పులు వచ్చాయని బల్దియా సిబ్బందిపై ఆరోపణలు
అయోమయానికి గురవుతున్న ఆశవాహూలు
తప్పులతడకల్లా ఉన్న
ఓటర్ లిస్ట్‌లను సరిచేస్తాం అంటున్న అధికారులు
సమయం తక్కువ ఉండడంతో ఆందోళన చెందుతున్న ఆశావాహులు
కామారెడ్డి, జనవరి 6 (విజయక్రాంతి): త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు ఖరారు చేసేందుకు ప్రభుత్వం ఒకవైపు సన్నాహాలు చేస్తుంటే మరోవైపు ఓటర్ లిస్టులు తికమకగా ఉండడం ఆశావాహూలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఓటర్ లిస్టులు తప్పుల తడకలుగా మారాయి. తమకు అనుకూలమైన వారు తమ వార్డులో ఉన్న వారిని ఓటర్ లిస్ట్ లో చేర్పిస్తే వార్డులో వారి పేర్లు గల్లంతయ్యాయని మరో వార్డులో వారి పేర్లు ఉన్నాయంటూ పలువురు ఆశావహులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద పట్టణాలలో ఓటర్ లిస్టులను చూసి ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు. తమకు అనుకూలంగా రిజర్వేషన్లు కలిసి వస్తే పోటీ చేసేందుకు తహతహలాడుతున్న ఆశవాహూలకు ఓటర్ లిస్టులు షాక్ ఇచ్చాయి. తమ వార్డుల వారి పేర్లు ఇతర వార్డులో వచ్చాయని ఆశావాహూలు గగ్గోలు పెడుతున్నారు. బల్దియా సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయి వార్డుల నుంచి ఇతర వార్డుల్లో ఎలా వెళ్తాయంటూ బల్దియా అధికారులను ఆశావహులు ప్రశ్నిస్తున్నారు. తమ పొరపాటు ఏమీ లేదంటూ మున్సిపల్ సిబ్బంది చెప్తున్నారు. ఓటర్ లీస్టుల తిక మక తో ఆశవా హూలు ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు రానుండడంతో మున్సిపల్ అధికారులు ఓటర్ లిస్టులను ఖరార్ చేశారు.
ఈనెల 10న తుది ఓటరు జాబితాను ప్రకటించనుండడంతో మరో నాలుగు రోజులే గడువు ఉండడంతో ఈ లోగా తీకామాకా గా మారిన ఓటర్ లిస్ట్ లను అధికారులు సరి చేస్తారా లేదా వేచి చూడాల్సిందే. కాలనీలలో ఆశావాహులు బల్దియ సిబ్బందితో తిరుగుతూ తప్పుడు తడకలుగా మారిన ఓటర్ వివరాలను సరి చేయించే పనిలో నిమగ్నమయ్యారు. ఏ వార్డులో చూసిన తప్పుల తడకగా మారిన ఓటర్ లిస్ట్ లను సరిచేయాలని మున్సిపల్ కార్యాలయాల ఎదుట మంగళవారం బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడిల మేరకే ఓటర్ లిస్ట్ లలో తికమకలు చేశారంటూ బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు మాత్రం ఎవరి ఒత్తిడి లేదంటూ లిస్టులో తయారీలో తప్పులు జరిగి ఉండవచ్చు అంటూ సరిది చెబుతున్నారు.
ఎన్నికలకు సమయం దగ్గరగా ఉండడంతో ఆశావాహులు తమకు అనుకూలమైన ఓట్లు గల్లంతూ కావడం పట్ల ఆందోళనకు గురవుతున్నారు. తమ కాలనీలో ఉన్న తమకు అనుకూలమైన వారి పేర్లను ఓటర్ లిస్టులలో చేర్పిస్తే వారి పేర్లు గల్లంతు కావడం ఆందోళన గురిచేస్తుందంటూ పలువురు విజయ క్రాంతి ప్రతినిధితో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి తాము ఎన్నికల్లో నిలబడాలని ఆలోచన ఉంటే తమకు తీక మక గా ఉన్న ఓటర్ లిస్ట్ లను చూస్తే ఆందోళన పడాల్సి వస్తుందని అంటున్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో 49 వార్డులు, బాన్సువాడలో 19 వార్డులు, ఎల్లారెడ్డిలో 12 వార్డులు, బిచ్కుందలో 12 వార్డులు ఉన్నాయి.
ఓటర్ లిస్టులు సరిచేస్తున్నాం
కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీల్లో ఓటర్ లిస్ట్ లలో పొరపాటు జరిగాయని పలు పార్టీల నాయకులు ఫిర్యాదు చేయడంతో మరోసారి ఇంటింటికి తిరిగి ఓటర్ లిస్టును సరిచేయాలని సంబంధిత మున్సిపల్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 10 వరకు అన్ని వార్డుల కు సంబంధించిన ఓటర్ లిస్టులను పరిశీలించి సరిచేస్తామన్నారు. ఎవరు ఆందో ళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
- ఆశిష్ సంగువాన్, కలెక్టర్, కామారెడ్డి