28 June, 2026 | 2:49 PM

Breaking News

ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •  

మే 14 నుంచి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు

09-05-2025 02:04 AM

నల్లగొండ, మే 8 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్షలకు మే 14 నుంచి నిర్వహించనున్నట్టు ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. గతంలో వాయిదా వేసిన పరీక్షల నూతన టైమ్ టేబుల్ను ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవిలతో గురువారం విడుదల చేశారు. టైమ్ టేబుల్కు సంబంధించిన పూర్తి వివరాలను యూనివర్సిటీ వ్బుసైట్లో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు.