calender_icon.png 22 May, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాక్టర్ ఫ్యాన్‌లో పడి మహిళకు తీవ్ర గాయాలు

09-05-2025 02:01:21 AM

తుంగతుర్తి, మే 8  : ఐకెపి సెంటర్ లో వరి ధాన్యంలో ఎగబోస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఫ్యాన్ లో పడి ఓ మహిళ చేతికి తీవ్ర గాయాలైన ఘటన జిల్లాలోని తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తగూడెం గ్రామానికి చెందిన ఉప్పుల విజయ గురువారం మధ్యాహ్నం ట్రాక్టర్ ఫ్యాన్ వేసి వడ్లు తూర్పారా వస్తుండగా ప్రమాదవశాత్తు తన ఎడమ చేయి మోచేతి భాగం ఫ్యాన్ లో పడిందన్నారు.

దీంతో ఆ భాగం నుజ్జు నుజ్జు అయిందన్నారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం తుంగతుర్తికి తరలించి అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం సూర్యాపేటకు తరలించినట్లు కుటుంబ సభ్యులు  తెలిపారు. ఐకెపి సెంటర్లో గాలి మరలు పెట్టీ వడ్లు తూర్పారా పోసేవారు తగు జాగ్రత్తలు పాటిస్తూ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని మన ఊరు సూచిస్తున్నారు.