30-07-2025 06:41:32 PM
అడిషనల్ రెవెన్యూ కలెక్టర్ విక్టర్..
తాడ్వాయి (విజయక్రాంతి): విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతగా అందించాలని జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ విక్టర్(Additional Collector Victor) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన బుధవారం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. వంట వండేటప్పుడు చేతులు పరిశుభ్రంగా కడుక్కొని వండాలని సూచించారు. విద్యార్థులు సైతం ప్రతిరోజు చేతులను శుభ్రంగా కడుక్కొని తినేలా చూడాలన్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు ఈ సంవత్సరం బాగా చదువుకొని 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్వేత, ఎంఈఓ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.