30-07-2025 06:43:30 PM
తాడ్వాయి (విజయక్రాంతి): లబ్ధిదారులు ఇండ్లను వేగవంతంగా నిర్మించుకోవాలని తాడ్వాయి ఎంపీడీవో సాజిద్ అలీ(MPDO Sajid Ali) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆయన బుధవారం ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు తమ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం లబ్ధిదారులకు వెంటవెంటనే బిల్లులు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంబీర్ శ్యాంరావు తదితరులు పాల్గొన్నారు.