28 June, 2026 | 3:40 AM

ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు

06-09-2025 12:11 AM

మునిపల్లి, సెప్టెంబర్ 5 : మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం మిలాద్ ఉన్ నబీ వేడుకలు ముస్లిం సోదరులు భక్తి శ్రధ్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా గ్రామాల పురవీదుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండలంలోని బుదేరా చౌరస్తా లో ముస్లిం సోదరులు శుర్ కుర్మా ( సేమియా పా యసం) పంపిణీ చేశారు.

అనంతరం పలువురు ముస్లిం సోదరులు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జీవితం బోధనలను గుర్తు చేసుకుంటూ ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండలములోని అన్ని గ్రామాల ముస్లిం మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.