పండుగల్లో సంప్రదాయాలు పాటించాలి
- శాంతియుత వాతావరణంలో శోభాయాత్ర సాగాలి
- ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తూ పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. వినాయక నవరాత్రుల ముగింపు సందర్భంగా శుక్ర వారం నల్లగొండలోని పాత పట్టణం హనుమాన్‌పురాలో ఏర్పాటు చేసిన 1 నంబర్ వినాయక విగ్రహానికి మంత్రి పూ జలు నిర్వహించి గణేష్ శోభాయాత్రను ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడు తూ.. నల్లగొండ జిల్లాలో 30 ఏండ్ల నుం చి ప్రశాంత వాతావరణంలో వినాయక ఉత్సవాలను, నిమజ్జనాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ సంవత్సరం కూడా అలాగే శాంతియుత వాతావరణంలో వినాయక శోభాయాత్ర నిర్వహించాలని యువతకు సూచించారు. ప్రత్యే కించి యువకులు ఎక్కడా అత్యుత్సాహం ప్రదర్శించవద్దని కోరారు. పట్టణంలో అన్ని మతాలను గౌరవిస్తూనే అభివృద్ధిని కొనసాగిస్తున్నామన్నారు.
200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాన్ని మొదలుపె ట్టామని, లతీఫ్ సాహెబ్ దర్గా గుట్ట, బ్ర హ్మంగారిగుట్టలకు 150 కోట్లతో ఘాట్ రోడ్లు నిర్మిస్తున్నామని, 30% పనులు పూర్తయ్యాయని చెప్పారు. ప్రభుత్వం ఈ సంవత్సరం వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేసిందని తెలిపారు.
కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్, నల్లగొండ ఆర్డీవో వై అశోక్‌రెడ్డి, గణేశ్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, వక్త వెంకట్ నివాస్, చింత సాంబమూర్తి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, మాజీ జెడ్పీటీసీ, లక్ష్మయ్య, గుమ్మల మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






