28 June, 2026 | 2:51 AM

ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం

06-09-2025 12:12 AM

మునిపల్లి, సెప్టెంబర్ 5 : మునిపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు పడమటి నాగిశెట్టి ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన దేశ ప్రజలకు ముందుగానే దీపావళి కానుక ఇచ్చారన్నారు.

అలాగే దేశ ప్రజల శ్రేయస్సు కోసం మధ్య తరగతి ప్రజలు అభ్యున్నతి లక్ష్యంగా జీఎస్టీలో సంచలనాత్మక నిర్ణయం తీసుకొని రాబోయే తరానికి అభివృద్ధి బాటలు వేశారన్నారు. ఈ కార్యక్రమంలో కంకోల్ బూత్ అధ్యక్షులు విజ య కుమార్, రాకేష్, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు అయ్యప్ప స్వామి,

జిల్లా నాయకులు సంగయ్య స్వామి, ఆంజనేయులు, మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు వీరన్న పటేల్, రవి కుమార్, యువ మోర్ఛ అధ్యక్షులు శేఖర్ యాదవ్, సీనియర్ నాయకులు నగేష్, ప్రవీణ్ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.