10 August, 2026 | 3:35 AM

విద్యుత్‌షాక్‌తో పాడి ఆవు మృతి

10-08-2026 01:44 AM

బాలానగర్ ఆగష్టు 9 (విజయక్రాంతి): మండలంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో ఓ రైతు జీవనాధారాన్ని కోల్పోయాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు వివరాలు ఇలా ఉన్నాయి.  హేమాజీపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం హేమాజీ పూర్ గ్రామానికి చెందిన రైతు భైరమోని శశిధర్కు చెందిన పాడి ఆవు విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. గ్రామంలో వేలాడుతున్న లూజ్ విద్యుత్ లైన్ కారణంగానే ఆవు మృతి చెందిందని వారు తెలిపారు.

మృతి చెందిన ఆవు రోజుకు సుమారు 10 లీటర్ల పాలు ఇస్తూ.. కుటుంబానికి జీవనాధారంగా ఉండేదని రైతు కన్నీటిపర్యంతమయ్యాడు. ఆవు మృతితో తన జీవనోపాధి దెబ్బతిందని, తన బాధను ఎవరు పట్టించుకుంటారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు గుర్తించి ఆదుకోవాలని రైతు కోరాడు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా హేమాజీపూర్ గ్రామంలోని లూజ్ విద్యుత్ లైన్లను వెంటనే సరిచేయాలని గ్రామస్తులు ఉన్నతాధికారులను కోరారు