24 April, 2026 | 1:51 AM

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

24-04-2026 12:00 AM

ముకరంపుర, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి): వాసవి మాత జయంతిని అధికారిక రాష్ట్ర పండుగగా జరపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడంతో నగరంలోని టవర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ నాయకులు సిరిపురం మనోజ్ కుమార్, కంకణాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి మాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్  చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కన్న కృష్ణ, నాయకులు కటకం వెంకట రమణ, నార్ల కార్తీక్, ముక్క భాస్కర్, ఎలగందుల మునీందర్, పోకల లక్ష్మీనారాయణ, చందా లక్ష్మీనారాయణ, పైడా రవి, దేవి శెట్టి రమేష్, మడుపు మోహన్, కార్పొరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, సరిళ్ళ ప్రసాద్, బడిశెట్టి భూమయ్య,  చిట్టిమల్ల శ్రీనివాస్, తాటి పెళ్లి సతీష్ బాబు, అక్కినపల్లి నాగరాజు, ఏవీఎం మధు,భూపతి శ్రీనివాస్, బొల్లం సంతోష్, గజ్జల వెంకటేష్, అందే శంకర్, కోటి, తదితరులు పాల్గొన్నారు.