24 April, 2026 | 1:50 AM

భగీరథ మహర్షి ప్రతి ఒక్కరికీ ఆదర్శం

24-04-2026 12:00 AM

గద్వాల టౌన్, ఏప్రిల్ 23 : అసాధ్యం అనుకున్న గంగమ్మను భూమండలంకు తీసుకొచ్చి సకల జీవరాశులకు నీటిని అం దించిన భగీరథ మహర్షి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను పుర స్కరించుకొని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఐడిఓసి వద్ద మహర్షి చిత్రపటానికి అధికారులు, సగర సంఘం నేతలు పూలమాలలు వేసి, పూజ లు చేశారు.

ముఖ్యఅతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహర్షులు అంటేనే గొప్ప వ్యక్తులని, అందులోనూ భగీరథ మహర్షి తన తపోశక్తితో సాధించిన విజయం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో భూపాల్ రెడ్డి, డీఈవో విజ యలక్ష్మి, గద్వాల మున్సిపల్ కమిషనర్ జా నకి రామ్ సాగర్, ఇతర అధికారులు, సగర సంఘం నేతలు, తదితరులు పాల్గొన్నారు.