24 April, 2026 | 1:29 AM

ఆర్టీసీ సమ్మెకు బీజేపీ మద్దతు

24-04-2026 12:00 AM

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు 

ముకరంపుర ,ఏప్రిల్ 23 (విజయ క్రాంతి) బుధవారం నుండి ఆర్టిసి కార్మికులు చేస్తున్న సమ్మె కు పార్టీ తరఫున పూర్తి మద్దతు ఇస్తున్నట్లుగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రకటించారు. గురువారం సమ్మె చేస్తున్న శిబిరానికి వెళ్లి ఆర్టీసీ కార్మికులను కలిసి వారి న్యాయపరమైన కోరికలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.శాంతియుతంగా సమ్మె చేస్తున్న చోట టెంట్ కూడా వేసుకోవడానికి అనుమతి నిరాకరించడం ఆర్టీసీ యాజమాన్య నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు.

మీ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు మీ వెంట మా పార్టీ ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే ఆర్టీసీ కార్మికులు వారి సమస్యలు విన్నవించుకున్నారు. కల్యాణ లక్ష్మి పథకం అమలు చేస్తున్న అప్పటినుండి ఇప్పటివరకు మేము మా ఇళ్ళలో మా అన్నదమ్ములకు రాఖీలు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడిందని వారి గోడు వెల్లబోసుకున్నారు.