కొండగట్టు భక్తులకు పాలు పండ్లు అందజేత
ముకరంపుర,(విజయ క్రాంతి): గురు పౌర్ణమి సందర్భంగా శుక్రవారం కొండగట్టు గిరి ప్రదక్షణ చేసిన భక్తులకు డాక్టర్ నేహాతో పాటు మైత్రి అధినేత కొత్త జైపాల్ రెడ్డి 100 లీటర్ల పాలు 100 డజన్ల అరటి పండ్లు, కోట సతీష్ 100 డజన్ల అరటి పనులు 100 లీటర్ల పాలు.రుద్రాక్ష చందు 200 లీటర్ల పాలు.బొబ్బిలి వంశీ 30 కేజీల బాదం పౌడర్, మనీష్ మల్లేశం వాటర్ బాటిల్స్ అందజేసి కొండగట్టు ఆంజనేయస్వామి కృపకు పాత్రులయ్యారు. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు పాలో పండ్లు అందుకొని అందరి పై ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఉండాలని భక్తులు కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో డి సంపత్ అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్. గడప నాగరాజు, ప్రశాంత్, శ్రీనివాస్, బండారు శ్రవణ్ పల్లపు శేఖర్ స్వామి, ప్రకాష్ స్వామి, ప్రవీణ్ స్వామి, పవన్, కుదురుపాక శ్రీను మొదలగు వారు పాల్గొన్నారు.






