25 April, 2026 | 3:55 PM

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరికలు

11-05-2024 02:31 AM

పటాన్‌చెరు, మే 10 : జిన్నారం మండ లం ఊట్ల గ్రామ మాజీ సర్పంచ్ వెంకట్రాంరెడ్డి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. వెంకట్రాంరెడ్డితో పాటు గడ్డ పోతారం మాజీ సర్పంచ్ నీరుడి శ్రీనివాస్, ఊట్ల గ్రామస్తులు కృష్ణ, శ్రీకాంత్, ప్రవీణ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కాట శ్రీనివాస్‌గౌడ్ కాంగ్రెస్ కండువాలు వేసి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాట శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీల నాయకులు, కార్య కర్తలు చేరుతున్నారన్నారు. 

కాంగ్రెస్‌లో చేరిన మైనార్టీలు

అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ మైనార్టీ నాయకులు శుక్రవారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి కాట శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. 

బీఆర్‌ఎస్ మైనార్టీ నాయకుడు అబ్దుల్ ఘని తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు.