25 April, 2026 | 6:32 PM

శ్రీ పోతులూరి బ్రహ్మంగారి ఉత్సవాలకు హాజరైన మంత్రి దామోదర్ రాజనర్సింహ

25-04-2026 05:16 PM

రేగోడు: మండల కేంద్రమైన రేగోడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మo గారి జాతర ఉత్సవాలకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హాజరై పట్టు వస్త్రాన లను సమర్పించారు. అనంతరం రేగోడు గ్రామానికి చెందిన అందోల్ మహేష్ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటికి  గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు మున్నూరు కిషన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దిగంబరావ్, సర్పంచ్ పర్వీన్ సుల్తానా చోటు మియా,  మాజీ సర్పంచ్ మన్నే విజయభాస్కర్, మాజీ ఎంపీటీసీ నరేందర్ నాయకులు  దేవేందర్, కల్లేటి రాధా కిషన్, దుద్యాల మల్లికార్జున్, నాగప్ప గారి దశరథం, గొల్ల భాస్కర్, చిదిరే కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.