calender_icon.png 10 May, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మినీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ ఎన్నిక

09-05-2025 07:31:04 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో రాణి రుద్రమ దేవి మినీ గూడ్స్ యూనియన్ సమావేశం సంఘం అధ్యక్షులు బండి సంతోష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షుడు కంచ వెంకన్న మాట్లాడుతూ కార్మికులందరూ తమ హక్కుల కొరకు సమిష్టిగా పోరాడాలని, అదేవిధంగా ఐక్యంగా ఉండాలన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు.

అధ్యక్షులుగా అజ్మీర రమేష్, ఉపాధ్యక్షునిగా కాసు సాయి యాదవ్, కార్యదర్శిగా బానోత్ యాకూబ్, కోశాధికారిగా కొడారి సాగర్, గౌరవ సలహాదారులుగా  కనుకుల రాంబాబు, అరిగే విజేందర్, కొమ్ము నరేష్, మునుకుంట్ల నరేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో అజ్మీర దీప్లా, కొమ్మ కుమార్, కంచ రాములు, గంధం శ్రీను, బోనగిరి శ్రీను, గోగు సతీష్, బానోత్ రాము, ఎస్కే పాషా, ఎండి షబ్బీర్, భూక్య పూల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.